![]() |
![]() |

కిరాక్ ఆర్పీ ఇటీవల మల్లెమాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా సుడిగాలి సుధీర్ ని దారుణంగా అవమానించారని, అది భరించలేకే అతను బయటికి వచ్చాడని కిరాక్ ఆర్పీ చేసిన ఆరోపణలు ఇప్పడు హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఆ ఆరోపణలన్నీ అబద్దాలని, మల్లెమాల ఎవరినీ అవమానించలేదని హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ తీవ్రంగా ఖండిస్తున్నారు. మల్లెమాల అందరిని బాగా చూసుకుందని, అవసరాల్లో ఉంటే డబ్బు ఇచ్చిందని, తరువాత ఎప్పుడో చేయాల్సిన స్కిట్ల డబ్బులు కూడా ముందే ఇచ్చేసిందని హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ చెప్పుకొచ్చారు.
అంతే కాకుండా రష్మీ ఇంటి లోన్ కోసం మల్లెమాల షూరిటి సంతకం కూడా చేసిందని, బయట ఏ సంస్థ అయినా ఇలా చేస్తుందా? షూరిటీ సంతకం పెడుతుందా? అని ఎదురుప్రశ్నిస్తున్నారు హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్.
"మా లాంటి వాళ్లకే కాకుండా చిన్నవాళ్లకు కూడా సాయం చేసింది. పరదేశీ వాళ్ల అమ్మకు బాగాలేదని తెలిసి ముందుగానే డబ్బులు ఇచ్చారు. అతను ఢీకి రైటర్ గా కూడా పనిచేసేవాడు. అలా అడ్వాన్స్ గా టీమ్ లీడర్లకు ఎన్నో లక్షలు ఇచ్చారు. పంచ్ ప్రసాద్ కు అయితే ఎన్నో షోలలో పని కల్పించారు. నెలకు అతను దాదాపు మూడు లక్షలు సంపాదిస్తున్నాడు. దొరబాబు, పరదేశీ ల వైజాగ్ ఘటన తరువాత మల్లెమాల ఒక్కమాట కూడా అనలేదు. పరిస్థితిని అర్థం చేసుకుని నా మాట మీద నమ్మకంతో ఆ ఇద్దరిని మళ్లీ తీసుకున్నారు. వేరే సంస్థ అయితే గేటు కూడా దాటనివ్వదు. కానీ మల్లెమాల అలా చేయలేదు. అంత గొప్ప సంస్థ మల్లెమాల" అని తెలిపారు హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్.
"అలాంటి మల్లెమాల మీద కిరాక్ ఆర్పీ ఆరోపణలు చేయడం చాలా తప్పు. వాటిని ఎవ్వరు కూడా సమర్థించరు. సుడిగాలి సుధీర్ కు డబ్బు అవసరం పెరిగింది.. అందువల్లే బయట ఎక్కువ వస్తుందంటే బయటికి వెళ్లాడు. అతన్ని ఇక్కడ ఎవరూ అవమానించలేదు" అంటూ కిరాక్ ఆర్పీకి హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ కౌంటర్ ఇచ్చారు.
![]() |
![]() |